Chanchalguda: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

by Gantepaka Srikanth |
Chanchalguda: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విడుదల అయ్యారు. హైకోర్టు(Telangana High Court) మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు శనివారం తెల్లవారుజామున ఆయన్ను జైలు వెనుక గేటు నుంచి విడుదల చేశారు. సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) బన్నీని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. అయితే, శుక్రవారం రాత్రే బన్నీ విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు అందే విషయంలో జాప్యం జరిగింది. దీంతో రాత్రి అంతా బన్నీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు.

Advertisement

Next Story

Most Viewed