గాజిరెడ్డిపల్లి శివారులో చిరుత సంచారం..!

by Sumithra |
గాజిరెడ్డిపల్లి శివారులో చిరుత సంచారం..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : చిరుత పేరు చెబితేనే వణుకు పుడుతుంది.. అలాంటిది ఒంటరిగా ఉన్న వ్యక్తి ముందు నుంచి వెళితే చెమటలు పట్టాల్సిందే.. అదే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎదురైనది. బైక్ పై విధులకు వెళ్తుండగా సడెన్ గా రోడ్డు దాటుతున్న చిరుతను చూసి ఒక్క సారిగా షాక్ కు గురైన ఘటన హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డి పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో జరిగింది. మెదక్ పట్టణంకు చెందిన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి గాజిరెడ్డి పల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగే ఒంటరిగా బైక్ పై వెళ్తుండగా గాజిరెడ్డిపల్లి శివారులో సడెన్ గా కొంత దూరంలో రోడ్డు దాటున్న చిరుతను గమనించి అక్కడే ఆగిపోయాడు.

చిరుత రోడ్డు దాటిన కొంత సేపటి వరకు భయంతో ఉన్న సదరు ఉపాధ్యాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగిన విషయం స్థానికులతో చెప్పాడు. గాజిరెడ్డి పల్లి శివారులో చిరుత సంచారం పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెప్పారు. అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తే విధులకు ఎలా వెళ్లాలని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed