Kangana Ranaut: సినిమాల్లోని డ్రగ్స్, మద్యం సాంగ్స్‌పై స్పందించిన ఫైర్ బ్రాండ్

by Anjali |
Kangana Ranaut: సినిమాల్లోని డ్రగ్స్, మద్యం సాంగ్స్‌పై స్పందించిన ఫైర్ బ్రాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ(BJP MP), బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Bollywood fire brand Kangana Ranaut) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవల ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. పెళ్లి సంబంధిత కేసుల్లో తొంభై శాతం మగాళ్లదే తప్పని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అతుల్ సుభాస్(Atul Subhas) ఆత్మహత్య చేసుకోవడంపై సంచలన కామెంట్స్ చేసింది. అతుల్ సూసైడ్ సెల్ఫీ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉందని.. ఒత్తిడి కారణంగనే సుభాష్ సూసైడ్ చేసుకున్నాడని.. దీంతో యావత్ దేశం షాక్‌కు గురైందని తెలిపింది. కానీ ఈ క్రమంలోనే ఎంపీ కంగన ఈ ఒక్క సంఘటన ఆధారంగా మహిళలందర్ని తప్పుపట్టలేమని వెల్లడించింది.

పెళ్లికి సంబంధించిన వంద కేసుల్లో 99 శాతం మగాళ్లదే తప్పు ఉంటుందని పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కంగనా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇకపోతే తాజాగా ఈమె సినిమాల్లోని మద్యంపై సాంగ్స్ గురించి స్పందించింది. పార్లమెంట్‌(Parliament)లో డ్రగ్స్(Drugs), మద్యం(alcohol)పై వస్తోన్న సినిమాల్లోని పాటల గురించి మాట్లాడుతారా? అని ‘ఆజ్‌తక్’(Aztak) నిర్వహించిన చర్చా వేదికలో కంగనాకు ప్రశ్న ఎదురవ్వగా.. ఇలాంటి విషయాల్లో కాళాకారులకే కాదు.. జనాలందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని సమాధానమిచ్చింది. మూవీల్లో పలు సీన్స్ ఆధారంగా సాంగ్స్ ఉంటాయని ఈ నటి తెలిపింది. ఇక డ్రగ్స్ వాడకం అంటే.. దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మూవీ టీమ్, గవర్నమెంట్, నటీనటులతో పాటు ప్రజలందరిపైనా ఉందని వెల్లడించారు. ప్రెజెంట్ కంగనా రనౌత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed