దుకాణ సముదాయాలు రోడ్ల పై వస్తే చర్యలు తప్పవు..

by Sumithra |
దుకాణ సముదాయాలు రోడ్ల పై వస్తే చర్యలు తప్పవు..
X

దిశ, భైంసా : దుకాణ నిర్వాహక దారులు రోడ్ల పై తమ వ్యాపారాన్ని ఉంచి నడిపితే చర్యలు తప్పవని పట్టణ సీఐ గోపీనాథ్ అన్నారు. నిర్వాహకులు రోడ్ల పై తమ వ్యాపారానికి సంబంధించిన వస్తువులను ఉంచి పాదాచారులు, పార్కింగ్ వాహనదారులకు ఇబ్బంది కలిగించద్దని అన్నారు. శనివారం ఉదయం పట్టణ మార్కెట్ ఏరియాలో సిబ్బందితో కలిసి రౌండ్స్ నిర్వహించారు. దుకాణ సముదాయాలు బయట ఉంచడం పై ట్రాఫిక్, సంబంధిత ఇబ్బందుల పై అవగాహన కల్పించారు. తమ హద్దుని మీరి, ఎవరైనా రోడ్లపై దుకాణ సముదాయాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు.

Advertisement

Next Story