సీపీగెట్ ఫస్ట్ ఫేజ్‌లో 21505 మందికి సీట్ల కేటాయింపు

by Mahesh |
సీపీగెట్ ఫస్ట్ ఫేజ్‌లో 21505 మందికి సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. 21505 మందికి సీట్లు అలాట్ అయినట్లు సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 28323 మంది వెబ్ ఆప్షన్ ఇవ్వగా 21505 మంది సీట్లు పొందినట్లు తెలిపారు. సీట్లు అలాట్ అయిన వారిలో 5811 మంది అబ్బాయిలు ఉంటే 15694 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇదిలా ఉండగా సీటు పొందిన విద్యార్థులు స్వయంగా ఈనెల 13 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు, టీసీ అందించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed