- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cotton Price: మురిపిస్తున్న తెల్ల బంగారం.. ఆల్ టైం రికార్డు
X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.11300 పలికింది. రోజు రోజుకు పత్తి ధరలు పై పైకి ఎగబాకడంతో.. ఇప్పటివరకు ఈ సంవత్సరంలోనే అత్యధిక రేటు సోమవారం నమోదు కావడం విశేషం. పత్తి రేట్లు రోజురోజుకు ఎగబాకుతున్నా.. పత్తి మాత్రం పండించిన రైతుల వద్ద లేదు. పత్తిని పండించిన రైతులు పత్తిని అమ్మే క్రమంలో నవంబర్, డిసెంబర్ ప్రథమార్థంలోనే రూ.8000 పైబడి రేటుతో చాలా మంది రైతులు అమ్మేశారు. రోజురోజుకు పెరుగుతున్న పత్తి రేట్లను చూసి ముందే పత్తి అమ్మిన రైతులకి బాధ వేస్తుంది. ఇవే రేట్లు అప్పుడు నమోదు అయితే బాగుండు అని రైతులు ఆవేదన చెందుతున్నారు.ఈ పెరుగుతున్న రేట్లు ముందే కోనేసిన పత్తి వ్యాపారులకే లాభం అని రైతులు వాపోతున్నారు.
Advertisement
Next Story