- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Caste Census : కులగణనపై సర్కార్ మరో కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన(Caste Census) సర్వేకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6 నుండి మొదలవనున్న ఈ సర్వే 30వ తేదీన ముగియనుంది. ఈ సర్వేలో దాదాపు 84 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు పాల్గొంటుండగా.. వీరందరికీ శిక్షణ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Decleration) అయినటువంటి కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు కులగణనపై ఇప్పటికే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6న లేదా 7న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల ముఖ్యనేతలతో సమావేశమై.. కులగణనపై వారి అభిప్రాయాలను, సూచనలు తీసుకొనున్నట్టు సమాచారం.