ఎల్లుండి అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే సంస్థలకు చర్యలు తప్పవు: ఈసీ హెచ్చరిక

by Anjali |   ( Updated:2024-05-11 17:07:50.0  )
ఎల్లుండి అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే సంస్థలకు చర్యలు తప్పవు: ఈసీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13 న పోలింగ్ జరగనుంది. కాగా ఎల్లుండి అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై తప్పక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ప్రచారం సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ప్రచారాలు చేస్తూ కనిపించకూడదని తెలిపారు. కాగా జూన్ 1 వ తేదీ సాయంత్రం 6. 30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ సమయాల్లో 160 కేంద్ర బలగాలు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. కాగా పోలింగ్ సమయంలో గుంపులుగా ఎక్కడ చర్చలు కొనసాగించొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్ సూచించారు.

Read More..

BREAKING : హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Advertisement

Next Story