- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు అలర్ట్.. నేటి నుండి కొత్త రూల్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా పరిస్థితులతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారంతా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇకపై వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలని సీపీ సి.వి ఆనంద్ అన్నారు. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా అస్తవ్యస్థంగా మారుతున్న ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే ఉద్దేశంతో చేపట్టిన రోప్ డ్రైవ్ ను సోమవారం జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తో కలిసి సీ.వి ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని దుకాణాదారులు పుట్ పాత్ లను ఆక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. షాపులు, వాణిజ్య సముదాయాలు నిర్వాహకులు తప్పనిసరిగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నగర ట్రాఫిక్ నియంత్రణ కోసం నేటి నుండి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తుందని చెప్పారు.
నేటి నుండి కొత్త నిబంధనలు:
హైదరాబాద్ నగరంలో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న స్టాప్ లైన్ దాటి వాహనాలు నిలిపితే రూ.వంద జరిమానా, పాదచారులకు ఇబ్బంది కలిగేలా పార్కింగ్ చేస్తే రూ. 600 జరినామా, ఫ్రీ లెఫ్ట్ వదలకుండా రోడ్డును బ్లాక్ చేస్తే రూ.వెయ్యి జరిమానా విధిచనున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.