రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఉగాది, సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఇవే!

by Ramesh N |
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఉగాది, సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఇవే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ రైళ్లు నడపనుంది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది. తిరుపతి నుంచి మచిలీపట్నం మధ్య రాకపోకలకు స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నారు. ఇది తిరుపతి, రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, గుడివాడ జంక్షన్, పెడన స్టేషన్ల మీదుగా మచిలీపట్నం చేరుతుంది.

సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్ మరో సమ్మర్ స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఇది సికింద్రాబాద్, లింగంపల్లి, శంకర్ పల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, బాల్కీ, ఉద్గిర్, లాతూర్ రోడ్, పర్లి వైజనాథ్, పర్భానీ తదితర స్టేషన్ల మీదుగా నాగర్‌సోల్ చేరుతుంది. మరోవైపు ఉగాది పండుగ సందర్భంగా స్పెషల్ ట్రైన్ ఒకటి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయనుంది. ఇది విజయవాడ నుంచి హుబ్లీకి రాకపోకలు సాగిస్తుంది. బుధ, గురువారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story