TG DSC: డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ‌ అల‌ర్ట్.. ఎడిట్ ఆప్ష‌న్‌కు అవ‌కాశం

by Ramesh N |
TG DSC: డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ‌ అల‌ర్ట్.. ఎడిట్ ఆప్ష‌న్‌కు అవ‌కాశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెట్-2024 ఫలితాలను నిన్న సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టెట్ అర్హత సాధించిన వారు డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా డీఎస్సీ దరఖాస్తులపై అభ్యర్థులకు విద్యాశాఖ ఓ అలర్ట్ ఇచ్చింది. టెట్ స్కోర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవ‌కాశం క‌ల్పించింది.

కాగా, మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. కేవలం పది రోజుల్లోనే ఫలితాలు సీఎంతో అధికారులు రిలీజ్ చేయించారు. టెట్‌ పేపర్‌ -1లో 57,725 (67.13%), పేపర్‌ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గతంలో నిర్వహించిన టెట్‌తో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఈ సారి పెరిగింది. అయితే, టెట్‌-24లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. అర్హత సాధించని దరఖాస్తుదారులకు డిసెంబర్‌ టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Advertisement

Next Story

Most Viewed