ALERT : ఎల్లుండి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-08 09:22:03.0  )
ALERT : ఎల్లుండి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంసెట్ రాసే అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఉన్నత విద్యామండలి, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్-2023 ని ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ నిర్వహణకు కావలసిన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌‌‌కు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణలో 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 33 కేంద్రాలు) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లాల అధికారులు, పోలీసు శాఖ, విద్యుత్ బోర్డు, టీఎస్ ఆర్టీసీ అధికారులు తమకు మద్దతును అందించాలని అభ్యర్థించారు. పరీక్ష రాసే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచి పరీక్ష హాలులోకి అనుమతించబడతారని తెలిపారు. మధ్యాహ్నాం సెషన్‌కు 1.30 గంటల నుంచి అనుమతి ఉంటుదని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థిని పరీక్ష హాల్‌లోకి అనుమతించరని, సూచించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన ఎంట్రీ ఉండదని స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. ఎగ్జామినేషన్ హాల్ లోపల చెక్ ఇన్ విధానంలో బయోమెట్రిక్ తీసుకుంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు లాంటివి ఉండకూడదని, బయోమెట్రిక్ ప్రయోజనం కోసం వారి చేతులను శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవాలని సూచించారు. ఇతర ఎలాంటి వస్తువులు అభ్యర్థులు తమ వెంట తీసుకు రాకూడదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed