- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALERT : అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ సైబర్ క్రిమినల్స్ భారీ స్కెచ్!
దిశ, రాచకొండ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ పోలీసులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఈ నెల 22 ఆ తర్వాత అయోధ్య రామయ్య ప్రత్యక్ష ఫోటోలు లేదా ప్రత్యక్ష కార్యక్రమాలు, ఇంకా ఇతర భక్తితో కూడిన కార్యక్రమాలు, పాటలు, ప్రవచనాలు, అయోధ్య రాముడితో పాటు వివిధ దేవుడి ఫోటోలు, అయోధ్య లో వీఐపీ సందడి అంటూ వచ్చే గుర్తు తెలియని లింక్‌లను అసలు టచ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్స్ టెక్స్ట్ మెసేజ్, లేదా వాట్సాప్ మెసేజ్, ఇంకా ఇతర సోషల్ మీడియా వేదికల మీద సైబర్ క్రిమినల్స్ కోట్ల లింక్ లను పంపించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ గుర్తు తెలియని లింక్‌లను టచ్ చేస్తే చాలు మీ ఖాతా ఖాళీ అని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని కొత్త లింక్స్ వస్తే టచ్ చేయకుండా వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ళు ఈ అయోధ్య రాం మందిరం వేడుకను తమ జాక్‌పాట్ ప్రోగ్రాంగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను కొల్ల గొట్టేందుకు వైరస్ లింక్స్‌తో కోట్లాది మొబైల్ ఫోన్స్ పై దాడి చేయనున్నారని పోలీసులు అలర్ట్ అయ్యారు. గుర్తు తెలియని లింక్స్‌ను ఓపెన్ చేయొద్దని, అవి ఒక సారి తెరుచుకుంటే మీ ఖాతా ఖాళీ అవడంతో పాటు డాటా కూడా వారి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలని పోలీసులు కోరుతున్నారు.