పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం క్లారిటీ

by Javid Pasha |   ( Updated:2023-10-18 10:04:25.0  )
పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. ఇది కొత్తగా పార్టీలోకి వచ్చినవారు చేస్తున్న కుట్ర అని అన్నారు. టికెట్ తనకే ప్రకటించారని, బీఫామ్ కూడా తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఇప్పటికీ కొంతమందికి బీఫాంలు ఇవ్వలేదు.

బీఫాంలు అందుకోని ఎమ్మెల్యేల్లో అబ్రహం కూడా ఉన్నారు. దాదాపు ఐదుగురు అభ్యర్థులకు సీటు ఇవ్వకూడదనే నిర్ణయానికి బీఆర్ఎస్ అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. అందులో అబ్రహం కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వేరే పార్టీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చివరి నిమిషంలో బీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే అబ్రహం రాజకీయ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed