- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'డీహెచ్ శ్రీనివాస్ జాబ్‌కు రిజైన్ చేసి బీఆర్ఎస్‌లో చేరితే బెటర్'
దిశ, డైనమిక్ బ్యూరో: వెంటనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఉద్యోగానికి గడల శ్రీనివాస్ రావు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉన్నాతాధికారులు గురువారం అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమవుతుంది.
రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో మొక్కలు నాటడం, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పేరుతో సర్య్కూలర్ విడుదలైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళి స్పందించారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తొందరగా రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతే తాము సంతోషిస్తాం అన్నారు. లేకపోతే నువ్వొక అసహజ, అవినీతి, చెంచా అధికారిగా చరిత్రలో మిగిలిపోతావని తీవ్ర విమర్శలు చేశారు. పైగా నీ డ్రామాలు చూడలేకపోతున్నాం అన్న ఆయన.. నువ్విచ్చిన ఈ సర్క్యులర్ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఉందన్నారు.
బాబు శ్రీనివాస్ Director Health
— Murali Akunuri (@Murali_IASretd) February 17, 2023
నువ్వు తొందరగా రాజీనామా చేసి BRS లో జాయిన్ అవుతే మేము సంతోషిస్తాం
లేకపోతే నువ్వొక అసహజ,అవినీతి,చెంచా అధికారిగా చరిత్ర లో మిగిలిపోతావు
నీ డ్రామాలు చూడలేకపోతున్నాము.
నువ్విచ్చిన ఈసర్కులర్ irregular &against the code of conduct @TelanganaCMO pic.twitter.com/4DM6EOdSyU