పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్.. బుల్డోజర్ రియాక్షన్ తప్పదంటూ బీజేపీ కౌంటర్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-26 17:16:55.0  )
పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్.. బుల్డోజర్ రియాక్షన్ తప్పదంటూ బీజేపీ కౌంటర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం నేత, చాంద్రాయణ గుట్ట పతంగి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ తీరు మరో సారి వివాదాస్పమైంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిందని తన స్టేజీ వద్దకు వచ్చిన పోలీసులను అక్బరుద్దీన్ అక్కడి నుంచి బెదిరించి మరి పంపేశారు. తాను మాట్లాడేందుకు ఇంకో 5 నిమిషాల సమయం ఉందని, ఇక్కడికెందుకు వచ్చారని స్థానిక పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఇదే వీడియోను బీజేపీ తెలంగాణ తన అఫిషీయల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

అక్బర్ తీరును ఖండిస్తూ ఇలా స్పందించింది. ‘దశాబ్ధాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మద్ధతుతో ఏఐఎంఐఎం క్రిమినల్ చర్యలకు పాల్పడుతుంది. వీరి పాలనలో ఓల్డ్ సిటీ అభివృద్ధికి నోచుకోలేదు. నేరాలకు అడ్డాగా మారింది. ఈ సారి ఎన్నికల్లో ఈ చెత్తను క్లీన్ చేయాల్సిన సమయం వచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే అక్బరుద్దీన్ చర్యకు తప్పకుండా బుల్డోజర్ రియాక్షన్ తప్పదు.’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, అక్బరుద్దీన్ పోలీసులపై ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed