అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-02-03 14:52:18.0  )
అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డ్‌తో గౌరవించింది. ఈ క్రమంలో దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అదానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డ్ ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న దక్కడం అంటే.. ఆయన చేపట్టిన రథయాత్రలో చోటు చేసుకున్న హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధుల సోపానాలు తప్ప మరేదీ లేదని వ్యాఖ్యానించారు.

బీజేపీ తమకు ఇష్టం వచ్చిన వారికి భారతరత్న ఇస్తూ.. ఆ అవార్డ్‌కు ఉన్న గౌరవాన్ని కించపరుస్తోందని అన్నారు. ఎల్‌కే అద్వానీ పాకిస్థాన్‌లో జిన్నా సమాధి దగ్గరికి వెళ్లి.. దేశం రెండుగా విడిపోవడానికి కారణమైన మహ్మద్ అలీ జిన్నాను పొగిడారని ఓవైసీ గుర్తు చేశారు. జిన్నాను ప్రశంసించిన వ్యక్తికి భారతరత్న ఎలా ఇస్తారని నిలదీశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ రథయాత్ర చేసిన ప్రతిచోటా దేశంలో మత కల్లోలాలు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డ్ ఇచ్చి దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed