- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Waltair: ప్రోటోకాల్ రాజు మాయలో పడిన డీఆర్ఎంలు.. అసలు ఎవరతను ?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) సౌరభ్ ప్రసాద్ ధరించే సూట్ ఖరీదు అక్షరాలా రెండులక్షల పదివేల రూపాయలట. ఇంత ఖరీదైన దుస్తులు కోట్లకు పడగలెత్తిన కుబేరులు కూడా ధరించే సందర్భం ఉండదు. అయితే ఈ ఖరీదైన బట్టలతో సౌరభ్‌ను తన ప్రొటోకాల్ అధికారి రాజు బుట్టలో వేసుకున్నారనే సమాచారంపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.
అక్రమ సొమ్ము నుంచే.. సూట్లు..
అక్రమ వసూళ్ళ నుంచి ఈ సొమ్ము చెల్లించడంలో ఈ అధికారిది అందెవేసిన చేయి అనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. విశాఖలోని ఒక ఖరీదైన బట్టల దుకాణంలో ఈ కోట్లను కుట్టిస్తాడు. ఇలా ఈ మధ్య కాలంలో ఏడు కోట్లను, ఒక శార్వానీని కుట్టించి సౌరభ్ మొప్పు పొందాడట. 2023 జులైలో సౌరబ్ ప్రసాద్ డీఆర్ఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది వరకూ ఎటువంటి మచ్చా లేకుండానే పనులను సాగించారు. అయితే నెమ్మదిగా సౌరభ్ ప్రసాద్ భార్య ద్వారా ఈ ప్రోటోకాల్ అధికారి రంగ ప్రవేశం చేసి అవినీతి పనులకు అంకురార్పణ చేశాడట.
అప్పుడూ ఈయనే..
సౌరబ్ ప్రసాద్‌కు ముందు డీఆర్ఎంగా పని చేసిన అనూప్ కుమార్ శతపతి వ్యవహారంలో కూడా ఈ ప్రోటోకాల్ అధికారే కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా అతడికి సుమారు ఏడు లక్షల రూపాయల విలువైన దుస్తుల్ని కుట్టించి ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడట. వీటి కారణంగానే సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కొందరు అధికారులను కూడా చేర్చినట్లు తెలిసింది. ప్రోటోకాల్ అధికారి బెహరా రాజు తో పాటు ఈ డీఆర్ఎంలు ఇద్దరికీ సహకరించిన మరికొందరు అధికారులపై సీబీఐ దృష్టి సారించింది. రాజును సీబీఐ రెండు గంటల పాటు విచారించిందని తెలిసింది. వాల్తేరు డివిజన్లో ఈ రెండు మూడు సంవత్సరాలలో 10 కోట్లకు పైగా విలువచేసే కాంట్రాక్టులకు సంబంధించిన ఫైల్ అన్నింటినీ తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో వచ్చిన లీజుల పైనా విచారణ జరుపుతున్నారు.