- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జోరుగా జీరో దందా..పల్లెల్లో కాంటాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి
దిశ, ఇచ్చోడ : మండలంలో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. మార్కెట్ యార్డుల్లోనే కొనాలన్న నిబందనలు ఉన్నా... వాటిని ఉల్లంఘించి పల్లెల్లో దర్జాగా కాంటాలు పెట్టి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. దీంతో మార్కెట్ ఆదాయానికి గండి పడుతోంది. మార్కెట్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా గ్రామాలు, పల్లెల్లో కాంటాలు పెట్టి రైతులను దోచుకుంటున్నారు. అదేవిధంగా రైతుల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న వ్యాపారులు ఇష్టారీతిగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం రైతుల నుంచి పంట దిగుబడులను ఎలక్ట్రానిక్ తూకాలతోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఇప్పటికీ పాత పద్ధతిలోనే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. సంబంధిత మార్కెట్ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడంతోనే అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించి పల్లెల్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.