- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kriti Sanon: బడా వ్యాపారవేత్త ప్రేమలో కృతి సనన్.. ఫొటో షేర్ చేస్తూ హింట్ ఇచ్చేసిన బ్యూటీ (పోస్ట్)
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కృతి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వంటి వారితో నటించి మెప్పించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
ఇటీవల ఈ బ్యూటీ ‘దో పత్తి’(Do Patti) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక కృతి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది కాలంగా బడా వ్యాపారవేత్త కబీర్ బహియా(Kabir Bahiya)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి కాకుండా వెకేషన్‌కు గ్రీస్‌కు వెళ్లినట్లు కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, కృతి సనన్(Kriti Sanon) ఇన్‌స్టా ద్వారా కబీర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేయడంతో ప్రేమ వార్తలకు బలం చేకూరినట్లైంది.
అలాగే ‘‘పుట్టినరోజు శుభకాంక్షలు కే. నీ చిరునవ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అనే క్యాప్షన్ జత చేస్తూ రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. ప్రజెంట్ కృతి పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా లవ్ గురించి హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే ఇదే ఫొటోను షేర్ చేస్తూ కృతి సోదరి నూపుర్ సనన్(Nupur Sanon), ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్(Stebin Ben) పోస్టులు పెట్టడం గమనార్హం.