Assembly Elections: మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-20 02:27:41.0  )
Assembly Elections: మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్..
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్ లో రెండో దశ పోలింగ్ (Jharkhand Second Phase Election) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్ లో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ(BJP), శివసేన(Sivasena), ఎన్సీపీ(NCP)ల కూటమి.. మహాయుతిగా (Mahayuti) బరిలోకి దిగగా.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి మహా వికాస్ అఘాడీల (MVA) మధ్య ప్రధాన పోటీ జరగనుంది. బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఝార్ఖండ్ లో ఎన్డీయే - ఇండియా కూటమిల మధ్య పోటీ జరుగుతోంది. రెండో విడత ఎన్నికల్లో 528 మంది బరిలో నిలబడ్డారు.

మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణె, పలువురు బాలీవుడ్ నటీనటులు ఓటు వేశారు.




Advertisement

Next Story

Most Viewed