BRS ఓటమికి అదే కారణం.. అసెంబ్లీలో కుండబద్దలు కొట్టిన అక్బరుద్దీన్ ఒవైసీ

by Gantepaka Srikanth |
BRS ఓటమికి అదే కారణం.. అసెంబ్లీలో కుండబద్దలు కొట్టిన అక్బరుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణమని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ మిత్రులు ఈ విషయాన్ని అంగీకరించాలని సూచించారు. ధరణి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. వీలైనంత త్వరగా ధరణి పోర్టల్‌ను మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. ధరణిని సులువుగా వదిలేయొద్దు అని.. మరో రోజు ధరణి అంశంపై చర్చ పెట్టాలని అభిప్రాయపడ్డారు.

ధరణి వచ్చాక ఎవరిపై ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో తాను వివరాలతో సహా వివరిస్తాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం సైతం తీసుకుంది. అంతేకాదు.. అధికారంలో రాగానే ధరణి సమస్యలపై అధ్యయనం కోసం కమిటీనీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల కొన్ని సిఫారసులు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సిఫారసుల మేరకు.. ధరణి పోర్టల్ భూమాతగా మార్చి.. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed