- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానాశ్రయ మెట్రో ప్రత్యేకతలివే!
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్రయానికి రాయదుర్గం నుంచి మెట్రో సేవల పనులకు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.6,250 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తం 31 కిలో మీటర్ల దూరంలో రైలు మార్గం ఉండనుంది. ఆకాశ మార్గం 27.5 కిలో మీటర్లు ఉండనుంది. భూమార్గం కిలో మీటర్ మేర నిర్మించనున్నారు. మొత్తం 9 స్టేషన్లను ప్రయాణీకుల సౌకర్యార్థం నిర్మిస్తారు. ఈ విమానాశ్రయ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 26 నిమిషాల్లో చేరుకోవచ్చు. మూడేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు.
ప్రస్తుతం ఉన్న మెట్రో సేవలకన్నా అధునాతన సేవలు అందిస్తారు. ఎక్కవ మంది కూర్చునేందుకు వీలుగా చైర్ కార్లు ఉంటాయి. ప్లాట్ ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలిక పాటి స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి. కారిడార్ లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్ లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్లలో విమాన రాకపోకలు తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సీఎఐఎస్‌ఎఫ్ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీలు చేపడతారు.