ఈ నెల 30న ప్రియాంక రాక

by Javid Pasha |
ఈ నెల 30న ప్రియాంక రాక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల30న ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. కొల్లాపూర్​లో జరిగే సభకు చీఫ్​ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు కాంగ్రెస్​కండువ కప్పుకోనున్నారు. మహిళా డిక్లరేషన్​ను ప్రకటించే ఛాన్స్​ ఉన్నదని కాంగ్రెస్​వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, చేయాల్సిన కార్యక్రమాలపై కాంగ్రెస్ ఫోకస్​పెట్టింది. దీనిలో భాగంగా ఆదివారం పొలిటికల్ అపెక్స్​కమిటీ(పీఏసీ) మీటింగ్ జరిగింది. థాక్రే అధ్యక్షతన దాదాపు 3 గంటలకు పైగా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటెజిస్ట్ సునీల్ కనుగోలు కూడా స్పెషల్ గెస్ట్​గా విచ్చేశారు. సుమారు 30 నిమిషాల పాటు అన్ని నియోజకవర్గాలపై పవర్​పాయింట్ ప్రజెంటేషన్​ఇచ్చారు.అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా బలాలు, బలహీనతలను వివరించారు. సర్వేల ప్రకారం పరిస్థితులను చెప్పారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాధాన్యత పెరగాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కొట్లాటలు, సమన్వయం లేకుంటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సునీల్ నొక్కి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆగస్టు 15న ఖర్గే మీటింగ్ ..

ఆగస్టు 15 వ తేదీన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ ఖర్గే అధ్యక్షతన జరగనున్నది.9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చేసిన అన్యాయంపై చర్చించనున్నారు. హామీలు, పథకాలు అమలు వంటి వాటిపై సమీక్ష జరగనున్నది. కేటాయించిన నిధులు, ఫండ్స్​డైవర్షన్లపై నివేదిక తయారు చేయనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే పథకాలు, స్కీమ్ లు, కార్యక్రమాలపై వివరించనున్నారు.ఈ మేరకు రెండు రోజుల్లో పార్టీ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నది. దీంతో పాటు రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే బస్సు యాత్రపై కూడా పీఏసీ మీటింగ్ లో నేతలంతా చర్చించారు. ఎక్కడ్నుంచి షురూ చేయాలి? ప్రజల్లోక ఏం అంశాలతో వెళ్లాలి? లేవనెత్తాల్సిన సమస్యలు ఏమిటీ? ప్రభుత్వ వైఫల్యాలను సాధారణ జనాలకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి? వంటి వాటిపై పీఏసీ లో డిస్కషన్స్​జరిగాయి.ఈ మేరకు సబ్ కమిటీని కూడా వేస్తూ తీర్మానించారు.

ఇక ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ముస్టీం, క్రిస్టియన్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్ లపై చర్చ జరిపారు. ఏం అంశాలు, హామీలను పొందుపరచాలి? ఎవరితో ప్రకటన చేయించాలి? అని సుదీర్ఘమైన చర్చలు నిర్వహించారు. సీనియర్​నేతలందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ మేరకు భవిష్యత్ కార్యచరణను రూపొందించనున్నారు. పీఏసీ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ ఖాన్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, ఎంపీ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, కేంద్ర మంత్రులు రేణుక చౌదరీ, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పీఏసీ లో చర్చింని అంశాలపై ఆదివారం ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కి గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్​పార్టీ రూ. 4 వేల ఫించన్​ప్రకటించగానే..బీఆర్​ఎస్​వికలాంగులకు రూ. 4016ను ప్రకటించిందన్నారు. ఇది కాంగ్రెస్​విజయమేనని తెలిపారు.అన్ని వర్గాలకు మేలు చేసేందుకు త్వరలో బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. ఎక్కడి నుండి యాత్ర చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకొని తేదీలు ప్రకటిస్తామన్నారు.గతంలో బస్సు యాత్ర అనుభవం ఉన్న వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్​అలీ మాట్లాడుతూ..పేదలకు ఏం చేస్తే లాభం? జరుగుతుందని అధ్యయనం చేస్తున్నామన్నారు.

5 డిక్లరేషన్ లపై స్కలర్స్ తో, నిపుణులతో స్డడీ చేస్తున్నామన్నారు.కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమేన్ చాంది, మాజీ మంత్రి సి రామచంద్ర రెడ్డి లకు పీఏసీ మీటింగ్ లో సంతాపం తెలిపామన్నారు. మరోవైపు మణిపూర్ లో 80 రోజులుగా దారుణాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్​అయ్యారు. ఈ మేరకు మణిపూర్ ఘటనను కాంగ్రెస్ ఖండిస్తూ తీర్మానించిందన్నారు. మణిపూర్ లో ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని, శాంతి నెలకొల్పాలని పీఏసీ తీర్మానం చేసిందన్నారు. ఇక అతి త్వరలో బీఆర్ఎస్​, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు.

Advertisement

Next Story