ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్.. మళ్లీ గవర్నర్‌ వద్దకు ఫైలు

by Gantepaka Srikanth |
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్.. మళ్లీ గవర్నర్‌ వద్దకు ఫైలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం, దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణకు నిర్ణయం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు, అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్ పేట చెర్వు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story