Gold advertisements :‘బంగారు దుకాణాల యాడ్స్‌.. ప్రజలు మోసపోతున్నరు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-27 14:22:23.0  )
Gold advertisements  :‘బంగారు దుకాణాల యాడ్స్‌.. ప్రజలు మోసపోతున్నరు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పేరున్న బంగారు దుకాణాల టీవీల ప్రకటనలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోకుండా కాపాడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కి శనివారం లేఖ రాశారు. ‘‘అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ - మీ పాత బంగారు ఆభరణాలు తమ వద్ద డిపాజిట్ చేసి, నగను (నగ నాణ్యతను) బట్టి 5 నుంచి 11 నెలలలో తరుగు లేకుండా కొత్త నగలు తీసుకెళ్లండి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ మరెక్కడా లేదు’’ అంటూ ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పెద్ద పేరున్న వ్యాపార సంస్థల ప్రకటనలను ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇంత వరకే చాలామంది వారి పాత ఆభరణాలను అనేక బంగారు వ్యాపారస్థుల దుకాణాల్లో డిపాజిట్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఊహించని కారణాలచే ఈ బంగారు దుకాణాల వ్యాపారస్తులు గడువు తీరిన తర్వాత డిపాజిట్ చేసిన వారికి పాత నగలకు సరిపోను తరుగు లేకుండా కొత్త నగలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైతే, వివిధ దుకాణాలతో నగలను డిపాజిట్ చేసిన వందలాది వేలాది మంది డిపాజిట్ దారులను ఆదుకోవడానికి ప్రభుత్వం గాని బ్యాంకులు గాని ఏదైనా గ్యారెంటీ ఇచ్చినవా లేదా తెలుసుకొవాలన్నారు. ఒకవేళ అనుమతి ఇచ్చిఉంటే ఎంత విలువైన ఆభరణాలను ప్రజలనుంచి డిపాజిట్‌గా సేకరించవొచ్చును తెలుసుకొవాలని పేర్కొన్నారు. అంతకు మించి ఆభరణాలను ప్రజల నుంచి డిపాజిట్ సేకరించకుండా చూడాలని తెలిపారు. ఒకవేళ వారి ప్రకటనలకు ప్రభుత్వం, బ్యాంకుల గ్యారెంటీ గానీ లేని పక్షములో ప్రకటనలను నమ్మి వందలాది వేలాది మంది వారి విలువైన ఆభరణాలను వ్యక్తిగత ప్రైవేట్ బంగారు దుకాణాల్లో డిపాజిట్ చేసి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు నష్టపోకుండా కాపాడడానికి ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.

Read more:

SBI Home Loans : ఎస్.బీ.ఐ నుంచి హోం లోన్ పై అదిరిపోయే ఆఫర్..

Advertisement

Next Story