TG High Court: స్పీకర్ కు కోర్టులు గడువు నిర్దేశించలేవు: ఏజీ

by Prasad Jukanti |
TG High Court: స్పీకర్ కు కోర్టులు గడువు నిర్దేశించలేవు: ఏజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ తరపున లాయర్లు కోరారు. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు లాయర్లు కోర్టును కోరారు. అయితే అనర్హత నిర్ణయంపై స్పీకర్ కు కోర్టులు గడువు నిర్దేశించలేవని ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్(ఏజీ) వాదనల వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. కాగా సోమవారం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో తేలేదాకా నిర్ణయం తీకుకోరా? అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.

Advertisement

Next Story