బ్రిడ్జి లేక రైతులకు తప్పని తిప్పలు..

by Aamani |
బ్రిడ్జి లేక రైతులకు తప్పని తిప్పలు..
X

దిశ,ముధోల్ : ముధోల్ లో కర్బల దారి వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆరుగాలం పండించిన పంట నీళ్ల పాలు అయిన సంఘటన బుధవారం ముధోల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ముధోల్ మండల కేంద్రం నుండి వ్యవసాయ చేనులో కి వెళ్లే ఖర్భాల దారిలో వాగు ఉంటుంది.వాగు అవతల వైపు స్థానిక రైతులు వ్యవసాయ భూమి సుమారు 600 ఎకరాలు ఉంటుంది. ప్రతి రోజు వ్వవసాయ చేనులోకి వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిసారి రైతులు బ్రిడ్జి నిర్మించి తమ బాధలు తీర్చాలని పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు. దీంతో రైతులకు ప్రతి సంవత్సరం ఇబ్బందులు తప్పడం లేదు.బుధవారం ముధోల్ కు చెందిన శ్యామల సాయినాథ్ అనే రైతు తన పొలంలో కోసిన సొయా పంట ను సుమారు 30 క్వింటాళ్ల సోయ సంచులను ట్రాక్టర్ తోని ఇంటికి తెచ్చే క్రమంలో వాగులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది.

దీంతో సోయా సంచులు వాగు నీటిలో పడిపోయాయి ఆరుగాలం పండించిన పంట నీళ్ల పాలు అయింది. దీంతో రైతు కుటుంబికులు కన్నీరు మున్నీరు అయ్యారు. వెంటనే జేసిబి తెప్పించి వాగు నుంచి ట్రాక్టర్ ను బయటకు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది.రైతులకు పంట నష్టం సంభవించింది. ఈ సంఘటన చూసిన చుట్టుపక్కల రైతులు పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం మన పాలిట శాపంగా మారిందని వారు వాపోయారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి పంట నష్టపోయిన రైతును ఆదుకొని, వాగుపై బ్రిడ్జి ని నిర్మించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story