- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే దీక్షలో కూర్చుంటాః ఎమ్మెల్యే హరీష్ బాబు
దిశ, కాగజ్ నగర్ః కాగజ్ నగర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె 21 రోజులకు చేరింది. వేతనాలు చెల్లించకపోవడంతో పరిశుద్ధ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మున్సిపల్ కార్యాలయం వద్ద మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 191 మంది కాంట్రాక్ట్ కార్మికులకు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారన్నారు. వీరికి నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదని.. ఈఎస్ఐ. పిఎఫ్ లు 2019 సంవత్సరం నుండి చెల్లించడం లేదన్నారు. నాలుగు నెలలకు సంబంధించి నెలకు రూ.41 ఒక లక్ష చొప్పున కోటి 64 లక్షలు బకాయి ఉందని. పి.ఎఫ్ కింద రూ. కోటి 95 లక్షలు. ఈ.ఎస్.ఐ బకాయిలు రూ. 40 లక్షలు మొత్తం రూ .4 కోట్ల బకాయిలు కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్మికులకు చెల్లించాల్సి ఉందన్నారు. రెక్క ఆడితే గానీ డొక్కాడని పరిస్థితిలో కార్మిక కుటుంబాలు మగ్గుతున్నాయన్నారు. కనీసం తినడానికి కిరణ షాపు వాళ్లు ఉద్దెర కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు తెలిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మున్సిపల్ కార్మికులతో పాటు దీక్షలో కూర్చుంటామని తెలిపారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోయి రోడ్ల పై దుర్గంధం వెదజల్లుతుందన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే కార్మికులతో కలిసి పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ భాజపా నాయకులు తదితరులు ఉన్నారు.