- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆంక్షలు ఎన్ని పెట్టిన సభను నిర్వహించే తీరుతాం'
దిశ, ముధోల్ : బైంసాలో రేపటి నుండి ప్రారంభమయ్యే ఐదో విడత ప్రజాసంఘామయాత్రకు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా నిర్వహించి తీరుతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముధోల్ నాయకులు బోస్లె మోహన్ రావు పటేల్ చరవాణి ద్వారా సామాజిక మాధ్యమాలలో తన సందేశాన్ని పంపుతూ వీడియో రిలీజ్ చేశారు. కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడకూడదని, అందరూ భైంసాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ పాదయాత్ర కోసం పోలీసుల అనుమతి కోరితే కావాలని అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలు ఎంఐఎం కు తొత్తుకాసే విధంగా ఉన్నాయని, బహిరంగ సభ పాదయాత్ర జరగకుండా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన సభను సక్సెస్ చేసి, ఎంఐఎం తొత్తులకు గుణపాఠం చెప్తామన్నారు. రానున్నది భాజపా రాజ్యమే అని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర భారీ సక్సెస్ అవుతుందనే భయం ప్రభుత్వంలో పట్టుకుందని అందుకే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. సభ పెట్టి తీరుతామని ప్రజా సమస్యలకు పై పోరాడుతామని పేర్కొన్నారు.