- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మావోయిస్టుల వార్నింగ్.. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌కు గట్టి ఆధునిక భద్రత.
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు పటిష్టమైన ఆధునికమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ నుంచి హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు ఎక్కడా లేని భద్రతను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తన క్యాంపు కార్యాలయానికి ఏర్పాటు చేశారు. మావోయిస్టు నుంచి ఎమ్మెల్యేకు పొంచి ఉన్న ముప్పును గ్రహించిన పోలీసు ఉన్నత అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యేకు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుబాస్ ల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీని మరింతగా పెంచారు.
క్యాంప్ ఆఫీస్ కు మెటల్ డిటెక్టివ్ భద్రత..
మావోయిస్టు పార్టీ నుంచి వరుసగా ఇప్పటివరకు మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేకు హెచ్చరిక లేఖలు విడుదలయ్యాయి. దీంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు గట్టి పోలీసు భద్రత కు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఎన్నడూ లేని విధంగా మెటల్ డిటెక్టివ్ తనిఖీ సిస్టంను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక పోలీసు బలగాల భద్రతను కూడా పెంచారు. బాబు స్క్వాడ్ మెటల్ డిటెక్టివ్, ప్రత్యేక పోలీసు బలగాల పహారా మధ్య ఇకనుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భద్రత వలయంలో ఉండటం గమనార్హం. మావోయిస్టుల నుంచి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ యంత్రాంగం ఆయనకు ఏర్పాటుచేసిన వ్యక్తిగత భద్రత కూడా మరింత పెంచారు. ఎమ్మెల్యే హోదాలో అందరిలాగానే గడ్డం వినోద్ కు ప్లస్ టు సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు. అయితే మావోయిస్టు హిట్ లిస్టులో ఉండడంతో ఆయనకు త్రీ ప్లస్ త్రీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ భద్రతా చర్యలకు తోడుగా కమిషనరేట్ పరిధి నుంచి ప్రత్యేక సెక్యూరిటీని కూడా అదనంగా ఏర్పాటు చేయడం విశేషం.
గట్టి పోలీసు భద్రత మధ్య ఎమ్మెల్యే..
ఇకనుంచి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సాధారణ భద్రతకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. గట్టి పోలీసు భద్రత వలయంలో నిత్యం బలగాల పహారా మధ్య ఎమ్మెల్యే గడ్డం వినోద్ లైఫ్ స్టైల్ మారనున్నది. మావోయిస్టుల వార్నింగ్ నేపథ్యంలో బెల్లంపల్లి లో పోలీసుల పనితీరులో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు భారీ భద్రత, ఆధునిక రక్షణ చర్యలను పటిష్టం చేసీ మావోయిస్టుల కు సవాల్ విసిరినట్టుగా చర్యలతో పోలీసులు దూకుడు పెంచారు.
పట్టణంలో పెరిగిన పెట్రోలింగ్..
అధికార పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల నుంచి అల్టిమేట్ నేపథ్యంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో పోలీసుల పనితీరులో వేగం పెరిగింది. మావోయిస్టు పార్టీ లేఖల నేపథ్యంలో ప్రజాప్రతినిధికి భద్రత చర్యలను పటిష్టత తో పాటు పట్టణంలో పోలీసుల పెట్రోలింగ్ మునుపటిలాగా మొదలైంది. పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రత చర్యలను కనివిని ఎరుగని రీతిలో పెంచారు. దానికి తోడు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి పోలీసు పెట్రోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు భద్రత చర్యలను పెంపొందించడమే కాకుండా పట్టణంలో కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు పెట్రోలింగ్ భద్రత చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా కనిపించిన పోలీసులు ఇకనుంచి అలా ఉండరు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మావోయిస్టు హెచ్చరిక ప్రకటనలు బెల్లంపల్లిలో పోలీసు నిఘా, పెట్రోలింగ్ కామన్ గా మారే పరిస్థితి లు తెచ్చిపెట్టాయి.
రాత్రిళ్ళు, గస్తీ ముమ్మరం..
బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఊపందుకు ఉన్నాయని పోలీసులు గ్రహించారు. అంతేకాకుండా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలకు వార్నింగులు ఎక్కువవడంతో పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు కాంగ్రెస్ లీడర్లనే కాకుండా పోలీస్ ఆఫీసర్లను సైతం టార్గెట్ చేయడంతో మావోయిస్టు వార్నింగ్ ల ను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. బెల్లంపల్లి కేంద్రంగా ఎమ్మెల్యే గడ్డ వినోద్ నివాస ప్రాంతం తో పాటుగా మందమర్రి,కాసిపేట, తాండూర్, రామకృష్ణాపూర్, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మునుపెన్నడూ లేని విధంగా పెట్రోలింగ్, రాత్రి గస్తీ లు ముమ్మరమయ్యాయి. అంతేకాకుండా కార్బన్ సెర్చ్ లతో గ్రామాలు, పట్టణాల్లో నిర్బంధ సోదాలు నిత్య కృత్యం గా మారాయి.