- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు హాని కలిగించే కార్నోపాస్ చెట్లను తొలగించాలి..
దిశ, బెజ్జుర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బొర్కుడే అన్నారు. సోమవారం బెజ్జూరు మండలం సలుగుపళ్లి గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరుపేదలందరికీ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిమ్మ చీకట్ల నుంచి వెలుగులు నింపేందుకే కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. కంటి వెలుగుకు ప్రజలు హాజరయ్యే విధంగా చూడాల్సిందిగా గ్రామకార్యదర్శి ధర్మయ్య ఆదేశించారు.
అనంతరం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలోని ప్రజలకు హానికరించి కారునోపాస్ చెట్లను తొలగించాలని అధికారుల ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సారంగపల్లి గ్రామపంచాయతీలో ప్రధాన రహదారికి ఇరువైపులా గురువు కాలువలు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. గ్రామపంచాయతీని ఆయన సందర్శించారు. ఆయన వెంట తహసిల్దార్ శ్రీపాల్, ఎంపీడీఓ మాధవి, ఎంపీఓ రమేష్ రెడ్డి, ఏపీవో చంద్రయ్య, కంటి వెలుగు డాక్టర్ సాయి కృష్ణ, సర్పంచి కొడప విమల, పేస కమిటీ ఉపాధ్యక్షులు కోడప విశ్వేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు కొండ్ర రవీందర్ గౌడ్, ఏణుక శ్రీహరి పాల్గొన్నారు.