- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP Janaki Sharmila : శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి
దిశ,భైంసా : శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరుకాపు సంఘంలో బుధవారం గణేష్ మండప నిర్వహకులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరై మాట్లాడారు...అన్ని కులాలు,మతాలు సమన్వయం తో పోలీస్ అధికారుల నిబందనలు ఉల్లంఘించకుండా పండగను జరుపుకోవాలని,ప్రతి వినాయక మండప నిర్వహకులు తమ మండపం వివరాలు ప్రత్యేక వెబ్ సైట్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి,సంబంధిత పత్రాలు పోలీస్ స్టేషన్ లో అందించాలన్నారు.విద్యుత్ అవసరం కోసం, కొండీలు పెట్టకుండా మీటర్ నుండే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు.గడ్డన్న వాగు ప్రాజెక్టులో వరద ఉద్రుతి ఎక్కువగా ఉన్నందున వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పడాలని,పండగలో ఆనందం ఉండాలి కానీ దుఃఖాన్ని మిగల్చవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి,సీఐ రాజారెడ్డి,ఎంఅర్ఓ ప్రవీణ్,ఎస్సైలు,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.