- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేకు చుక్కెదురు..
దిశ, లోకేశ్వరం : ఏడు సంవత్సరాలుగా నష్టపరిహారం ఇవ్వకుండా తాత్సారం చేసి ఉన్నఫలంగా 15 రోజులలో ఇల్లు ఖాళీ చేసి ఎక్కడ ఉండాలి అంటూ ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని పంచగుడి గ్రామస్తులు నిలదీశారు. నిర్మల్ నిజామాబాద్ జిల్లాలను అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణం కోసం ఇల్లు కోల్పోయిన పంచగుడి గ్రామస్తులకు బుధవారం లోకేశ్వరంలో ఎమ్మెల్యే నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసేందుకు రాగా బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. గత ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేసి ఇల్లు నష్టపోతున్న వారి జాబితాను తయారుచేసిన అధికారులు ఇప్పుడు చెక్కులు పంపిణీ చేసి 15 రోజులలో ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చెప్పడంతో ఎక్కడ ఉండాలంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో మూడు నెలల గడువు ఇస్తామని అధికారులు చెప్పారని అధికారులకు, నాయకులకు మధ్య అవగాహన లేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది బాధితులు నష్టపరిహారం చెక్కులు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఇల్లు ఖాళీ చేయడానికి నాలుగు నెలలు గడువు ఇస్తేనే చెక్కులు తీసుకుంటామని బాధితులు తెగేసి చెప్పారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఇల్లు ఖాళీ చేయడం ఎలా అని వారు ప్రశ్నించారు. అలాగే గత ఏడు సంవత్సరాల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం ఇస్తున్నారని ప్రస్తుతం అప్పటి ధరలతో పోల్చితే ఇళ్ల నిర్మాణం ఖర్చులు మూడు రెట్లు పెరిగాయని ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం సరిపోదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.