ఆదిలాబాద్ లో రూ.320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Nagam Mallesh |
ఆదిలాబాద్ లో రూ.320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్ః గ్రేడ్ వన్ గా మారిన ఆదిలాబాద్ మున్సిపాలిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్ లో ఖానాపూర్ చెరువును మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, అర్బన్ తహసిల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఆదిలాబాద్ పట్టణంలో రూ 320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతోపాటు, మంచినీటి సరఫరా కోసం ఓ హెచ్ ఎస్ ఆర్ లు ఏర్పాటు చేసి రాబోయే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. అదిలాబాద్ భవిషత్తు ఖానాపూర్ చెరువుపైనే ఉందన్నారు. ఈ చెరువులో పట్టణంలోని మురికి, డ్రైనేజీ నీరంతా కలవడంతో చెరువు దుర్గంధం అవుతుందన్నారు. పూర్తిగా చెరువు కలుషితం కావడంతో దోమలు వృద్ధి చెంది పట్టణంలో వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడ్తున్నారని పేర్కొన్నారు. ఆహ్లాదకరంగా ఉండాల్సిన చెరువు మురికి నీరు చేరి పాడయిపోయిందన్నారు. అలాగే చెరువు సైతం ఆక్రమణలకు గురైందని, ఇది మన అందరి పట్టణం కాబట్టి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. త్వరలో అదిలాబాద్ విమానాశ్రయం, రైల్వే లైన్ ప్రారంభమవుతుందనీ తెలియజేశారు. ఇందులో కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్,నాయకులు లాలా మున్న, జోగు రవి,విజయ్, రత్నాకర్, ముకుంద్,తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story