- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ ఢీ.. ఇద్దరు యువకులు దుర్మరణం
దిశ, కోటపల్లి: లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందడంతో మండలంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కోటపల్లి మండలం ఏదుల బంధం గ్రామానికి చెందిన దుర్గం ప్రభాకర్( 22), పోట్టాల సంజీవ్ (22) అనే ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దుర్గం ప్రభాకర్ కు ఇటీవల ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. మెడికల్ పరీక్ష కొరకు వేచి చూసే తరుణంలో కాలేశ్వరంలో దైవ దర్శనానికి వెళ్లారు. శనివారం సాయంత్రం ఇద్దరు మిత్రులు కలిసి బైక్ పై బయలుదేరారు. కాళేశ్వరంలో దైవదర్శనం చేసుకొని గుడిలోనే నిద్రించేందుకు ఇబ్బందిగా ఉందని రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఇంటికి వస్తున్నాము అని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలు దేరే క్రమంలో మహారాష్ట్ర కాలేశ్వరం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పొట్టల సంజీవ్ కి గత సంవత్సరం వివాహమై భార్య గర్భంతో ఉండగా.. తెల్లవారితే భార్య మౌనిక ను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళేది ఉండగా.. ఇంతలోనే సంజీవ్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.ఇతను వృత్తిరీత్యా కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు .తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.