దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్

by Shiva |
దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
X

దిశ, కాసిపేట: మండల పరిధిలోని పెద్దనపల్లి ఆర్.ఎస్ వైన్స్ లో దొంగతనానికి పాల్పడిని ముగ్గురిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు మందమర్రి ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలం ఆయన మాట్లాడుతూ సోమవారం కాసిపేట ఎస్ఐ గంగారాం, సిబ్బందితో కలిసి సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

దీంతో వారిని తమదైన స్టైల్ లో విచారించగా పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎండీ మహమూద్ ఖాన్, అబ్దుల్ షాకిబ్, ఎండీ గౌస్ కలిసి గత నెల 19న పెద్దనపల్లి ఆర్.ఎస్ వైన్స్ లో దొంగతనానికి పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. వారిలో ఎండీ గౌస్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వారి నుంచి జూపిటర్ 125 స్కూటీ, దొంగిలించబడిన ఎనమిది సెల్ ఫోన్లు జప్తు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story