- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీరనున్న మూడు మండలాల కష్టాలు..
దిశ, బెజ్జుర్ : తీగల ఒర్రె వంతెనకు నిధులు మంజూరు కావడంతో పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలాల ప్రజల కష్టాలు తీరనున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం బెజ్జూర్ మండలం సులుగుపెళ్లి సమీపంలో తీగల ఒరె వంతెనకు సిర్పూర్ ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల ఒర్రెకు ప్రభుత్వం ఎల్ డబ్ల్యూ ఎస్ కింద రు.2.53. కోట్లు, నాగుల ఒర్రె కు రు.2.58 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధుల మంజూరుతో మూడు మండలాల కష్టాలు కలిగిన తొలిగిపోయాయని తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మండలాల ప్రజలకు కష్టాలు తీరునున్నాయి.
తునికాకు రాయల్టీ సిర్పూర్ నియోజకవర్గానికి రూ.12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 2018-21 సంవత్సరానికి గాను ఈ నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి గ్రామాల్లో తునికాకు రాయల్టీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల10 లోపు గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, మండల కో ఆప్షన్ సభ్యులు బషరత్ ఖాన్, సర్పంచులు హనుమంతు, తిరుపతి, ఎంపీటీసీలు శ్రీనివాస్, గురజాల వెంకన్న, టీఆర్ఎస్ అధ్యక్షులు సకరం నాయకులు వర్ష శంకర్, పుల్లూరి సతీష్, జాహిద్ హుస్సేన్, రవీందర్ గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.