బెల్లంపల్లిలో ప్రారంభమైన పోలింగ్..

by Vinod kumar |   ( Updated:2023-11-30 02:31:21.0  )
బెల్లంపల్లిలో ప్రారంభమైన పోలింగ్..
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం లోని లక్ష 73,335 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందులో పురుషులు 86574, మహిళలు 86749 ఇతరులు 12 మంది ఉన్నారు. ఉద్యోగులు, కూలీలు ఉదయమే పోలింగ్ సెంటర్లకు వచ్చారు. నియోజవర్గంలోని 227 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సందడి నెలకొంది. 6 గంటలకు ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు.


నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమైంది. మహిళలు, ఉద్యోగులు, కూలీలు యువకులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆసక్తిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటింగ్ సందడి ఊపందుకుంది.. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో హద్దులు ఏర్పాటు చేసి సంఘటనలకు తావు లేకుండా ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story