- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రమాదం అంచున ప్రయాణం
దిశ, భీమిని : భీమిని మండలంలోని పలు గ్రామాల్లో రహదారులపై ఇరువైపులా ముళ్ళ పొదలు కమ్ముకు పోవడం తో రహదారులు ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు రహదారి వెంట వెళ్లాలంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని జగ్గయ్యపేట గ్రామం నుండి పెద్ద పేట గ్రామం వరకు రహదారికి ఇరువైపులా ముళ్ళ పొదలు గుబురుగా పెరిగి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వెళ్లే రహదారి నుండి మామిడిపల్లె గ్రామం మీదుగా పెద్ద పేట గ్రామం వరకు రహదారి పొడవునా ముళ్ళ పొదలు ఏపుగా పెరిగాయి. అంతే కాకుండా మూల మలుపులు ఉండడంతో ఆదమరచి వాహనాలు నడిపితే ఇక అంతే అన్న చందంగా తయారయ్యాయి. వాహనాలు వేగంగా నడిపిన రాత్రివేళ ఆదమరచి నడిపిన ముళ్ళ పొదల్లో పడే ప్రమాదం ఉంది.
గ్రామస్తులు ఈ విషయంపై పలుమార్లు భీమిని, పెద్ద పేట గ్రామ కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. భీమిని కార్యదర్శి నేను వచ్చి పరిశీలించిన తర్వాత ఆలోచిద్దామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పెద్దపేట నుండి ఐకెపి కార్యాలయం వరకు రహదారి పై ముళ్లపొదలు ఇబ్బందికరంగా మారాయని కార్యదర్శికి తెలుపగా ముళ్ళపొదలు తొలగించేందుకు జిపి నిధులు లేవని ముందుగా డబ్బులు పెట్టుకోవాలని నెల రోజుల తర్వాత మీకు డబ్బులు ఇస్తామని తెలిపినట్లు గ్రామస్తులు అన్నారు. అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించాల్సింది పోయి కార్యదర్శులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పెద్ద పేట గ్రామానికి వెళ్లే రహదారి పైన ఓ బొలెరో వాహనం ఎద్దు ను ఢీకొనడంతో ఎద్దు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు సైతం ప్రమాదాలకు గురైనట్లు ఇలాంటి ఘటనలు మచ్చుకు కొన్ని జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఉదయం వేళలో పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు టాటా మ్యాజిక్, ఆటోల్లో వెళుతున్నప్పుడు ముళ్ళ పొదలు వాహనాల్లోకి రావడంతో వాహనంలో ఉన్న వారికి ముళ్ళ పొదల కొమ్మలు తగిలి గాయాలు అవుతున్నట్లు తెలిపారు. నిత్యం పంట చేల్లోకి వెళ్లే వారికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రహదారికి ఏపుగా పెరిగిన ముళ్లపదలను తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.