Pranahita river : ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది...

by Sumithra |
Pranahita river : ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది...
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూరు మండలంలో ప్రాణహిత నది ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆదివారం బెజ్జూరు మండలంలోని తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణహిత నది ఉప్పొంగడం వల్ల బెజ్జూరు మండలంలోని పాపన్నపేట, మొగవెల్లి, సోమిని, తిక్కపల్లి, తలాయి, భీమారం, తదితర గ్రామాలోని పత్తి పంట పొలాలు పూర్తిగ నీట మునిగాయి. దీంతో రైతులకు సుమారు 1000 ఎకరాల్లో పంటలు నష్టపోయారు.

నీట మునిగిన తలై బ్రిడ్జి..

బెజ్జూరు మండలం సోమీని తలై గ్రామాల మధ్యలో గల వంతెన ప్రాణహిత నది ఉప్పొంగడంతో తలాయి బ్రిడ్జి నీట మునిగింది. దీంతో సోమిని, తలాయి, భీమారం, పాపన్నపేట గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాణహిత వరదల వల్ల ప్రతి ఏడాది పంటలు నష్టపోతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్పందించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బెజ్జూరు మండల వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed