- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే అధికారుల స్టెప్పులతో దశాబ్ది ఉత్సవాలు..
దిశ, భీమిని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం రెండవరోజు ఉత్సవాలను అటు అధికారులు, రైతు సంబరంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి మండలాల రైతు వేదికల వద్ద శనివారం అధికారులు ఉదయం ఏడు గంటలకు టిఫిన్స్, మధ్యాహ్న భోజనానికి చికెన్ తో వంట వార్పులో అధికారులు బిజీగా గడిపారు. కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామంలో గ్రామస్తులు ఎడ్లబండ్లతో, డప్పుసప్పులతో నృత్యాలు వేసుకుంటూ ఉత్సవ ర్యాలీని నిర్వహించారు.
వారితో పాటుగా అధికారులు కూడా స్టెప్పులు వేస్తూ కేరింతలు కొట్టారు. ఎడ్లబండ్ల పై రైతు వేదికల వద్దకు ర్యాలీగా వచ్చిన అధికారులు సభాకార్యక్రమం ముందు జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలను ప్రజలకు వినిపించారు. రైతు వేదికల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వచ్చే వారికి త్రాగునీటి వసతి కల్పించారు. ప్రజలు ఎండ తీవ్రతను పట్టించుకోకుండా ఇబ్బందులు పడుతూ సభకు హాజరయ్యారు. ఈ ఉత్సవ సభకు అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.