- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప చెల్లెలు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అప్పుడే లేపేసి ఉంటే పనైపోయేదంటూ కామెంట్స్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa-2). డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల అయి 16 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో అజయ్(Ajay) కూతురిగా యాక్ట్ చేసిన కావేరి అందరికీ తెలిసిందే. ఈమె అసలు పేరు పావని కరణం(Pavani Karanam). ఈ సినిమాలో ఈమె చిన్నాయన చిన్నాయన అంటూ పిలుస్తూ అల్లు అర్జున్ స్వభావాన్ని మార్చి మూవీలో బిగ్ ట్విస్ట్ తెప్పిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కావేరిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.
‘పుష్ప2’ సినిమా గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో ఈమె వరుస పోస్టులతో సుకుమార్‌కి, అల్లు అర్జున్‌కి థాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతుంది. ఒకటి రెండు పోస్టుల వరకు ఓపిక పట్టిన నెటిజన్లు.. అవి కాస్త 4,5 కావడంతో చిరాకు పడుతున్నారు. దీంతో ఈ భామ పోస్టుల కింద ఇంకా ఆపేయ్ తల్లి చిరాకు వస్తుంది అని, నువ్వే కనుక నటించావులే తల్లి సినిమాలో రోజూ ఏంది మాకు ఈ బాధ అని, అసలు పార్ట్1లోనే నిన్ను లేపేసి ఉంటే మాకు ఈ నస తప్పేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మరికొందరు మాత్రం ఆమెకు ఫేమ్ రావడానికి కారణం వాళ్లే కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతోంది మీకు నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి అంటూ పావనికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై నటి పావని ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.