- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం.. క్వింటాల్ రూ.7,600 పలుకుతున్న ధర
దిశ, కుబీర్: పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో అమ్మకుండా పత్తిని నిల్వ చేసుకున్న రైతులకు సిరుల వర్షం కురుస్తోంది. కుబీర్ మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు ఒక లక్ష క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) క్వింటాకు రూ.7,020 చొప్పున, రెండో రకం పత్తి అంటూ మళ్లీ 6,960 రూపాయల చొప్పున 37,160 క్వింటాల్లు కొనుగోలు చేసింది. రూ.63 వేల క్వింటాళ్ల పైచిలుకు పత్తిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం భైంసా మార్కెట్లో క్వింటాకు పత్తి ధర రూ.7,600 పలుకుతోంది. ఈ ధరలతో పోల్చుకున్న రైతు క్వింటాకు 580 చొప్పున నష్టపోవాల్సి వచ్చింది.
సంపన్నులైన రైతులు, బడా వ్యాపారులకు ధరల పెరుగుదల లాభాలను తెచ్చిపెడుతోంది సామన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంటలు చేతికొచ్చే సమయంలో ధరలను తగ్గించడం, పంటను అమ్ముకున్న తర్వాత ధరలు పెరగడం, పాలకులకు ప్రభుత్వాలకు తెలియదా అని రైతులు మండిపడుతున్నారు. పత్తి విస్తీరం తక్కువ ఉందని ధరలు పెరుగుతాయని ఆశతో రెండు మూడు నెలలు పత్తిని నిల్వ చేసినా.. ధర ఆశించిన స్థాయిలో పెరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీలోనూ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.