- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం...ఆందోళన చెందుతున్న రైతులు..
దిశ, మంచిర్యాల : ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులపాటు వర్ష సూచన ఉండటంతో రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. గత శనివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని రైతులకు తీరని నష్టం కలిగించగా.. మళ్లీ వర్షసూచన ఉందని తెలియడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అకాల వర్షానికి జిల్లాలోని పలుప్రాంతాల్లో 307 ఎకరాల్లో 175 మంది రైతులకు చెందిన రూ.16.55 లక్షల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మిర్చి మామిడి తోటల నష్టాన్ని అంచనా వేసే సర్వే పనుల్లో ఉద్యానవన శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, అధికారులు నిర్వహించిన ప్రాథమిక నష్టం అంచనా కన్నా.. వాస్తవ నష్టం నాలుగింతలు ఎక్కువగానే ఉంటుందని రైతులంటున్నారు.
చల్లటి వాతావరణంతో చీడపీడల ప్రభావం...
బలమైన ఈదురుగాలతో కురిసిన వర్షానికి జిల్లాలోని జన్నారం దండేపల్లి మండలాల్లోని వరి పైరు పైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ మండలంలోని తాళ్లపేట, రెబ్బనపల్లి, నాగసముద్రం, గూడెం మాకులపేట, నర్సాపూర్, జన్నారం మండలంలోని తిమ్మాపూర్, ద్వారక, తపాల్పూర్, రోడ్డు కూడా తదితర గ్రామాల్లో ఈనె దశ, పొట్టదశకు వచ్చిన వరిపంట పై ప్రభావం చూపింది. అక్కడక్కడ ముందుగా నాటు వేసిన ఇప్పుడు గొలక దశకు వచ్చిన పైరు పడిపోవడం, గింజలు నేలరాలాయి అక్కడక్కడ ఈదురు గాలులకు మొక్కజొన్న కర్రలు విరిగిపోగా, దిగుబడి తక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్షానికి తోడు చల్లటి వాతావరణం అలుముకోవడం వరి, మామిడి, కూరగాయల పంటల పై చీడపీడల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మామిడి తోటలకు నష్టం..
అకాల వర్షంతో జిల్లాలోని నెన్నెల జైపూర్, భీమారం మందమర్రి మండలాల్లోని పలుగ్రామాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నెన్నెల మండలంలోని చిత్తాపూర్, జోగాపూర్, ఆవడం, గొల్లపల్లి, మందమర్రి మండలంలోని మామిడి గట్టు పొన్నారం, ఆదిల్ పేట, వెంకటాపూర్ గ్రామంలో మామిడి తోటల చిన్న చిన్న పిందెలు, కాయలు నేలరాలాయి నేలరాలిన చిన్న చిన్న కాయలను అమ్ముకుందామన్న తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా.. కొనేవారు కానరాక గత్యంత లేక పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మామిడి తోటల రైతులు వాపోతున్నారు. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మిర్చి పంట ఉత్పత్తులను రెండో దఫా తీయించి ఆరబెట్టగా వర్షాలకు దెబ్బతింది.
చల్లటి వాతావరణం ఉంటే మిర్చిలో రంగు మారి నాణ్యత పై ప్రభావం చూపుతుందని కలవర పడుతున్నారు. కాగా, పంటల బీమాను ప్రభుత్వం కొన్ని సీజన్లుగా మంజూరు చేయడం లేదు. పంటల బీమాను అమలు చేయకపోవడంతో పరిహారం అందేది కష్టమే. గత కొన్ని సీజన్లుగా వ్యవసాయ అధికారులు ప్రాథమిక నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నా.. రైతుల వారీగా క్షేత్రస్థాయి సర్వే చేసి తుది నివేదికను ప్రభుత్వానికి పంపించాలంటున్నారు. తుది నివేదిక ఆధారంగా రైతుల వారీగా పంట నష్టం అంచనా వేసి పెట్టుబడి రాయితీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.