105 యేండ్ల వృద్ధురాలికి శస్త్ర చికిత్స

by Sumithra |
105 యేండ్ల వృద్ధురాలికి శస్త్ర చికిత్స
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏయిమ్స్ ఆసుపత్రి వైద్యులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 105 యేండ్ల వయసు గల గుమ్ముల బుచ్చిరాజమ్మ అనే వృద్ధురాలికి తుంటి ఆపరేషన్ చేసి అరుదైన ఘనత సాధించారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాలకు చెందిన బుచ్చిరాజమ్మకు తుంటి ఎముక విరిగి ఏయిమ్స్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆ వృద్ధురాలు షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, 105 యేండ్ల వయసు గల వృద్ధురాలికి శస్త్ర చికిత్స చేయడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న ఎముకల కీళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ ఎగైన శ్రీనివాస్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ సభ్యులతో కలిసి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగైన శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధులకు సంబంధించి ఆర్థోపెడిక్ విభాగంలో ఎన్నో శస్త్ర చికిత్సలను విజయవంతం చేశామని తెలిపారు. 100 యేండ్లకు పైబడిన వృద్ధులకు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆపరేషన్లను చేశామన్నారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ కు ధీటుగా శస్త్ర చికిత్సలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ వైద్యుడు శ్రీకాంత్, అనస్తీషియా డాక్టర్ సాగర్, ఆసుపత్రి డైరెక్టర్ గిరీష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story