సోయా కొనుగోళ్లపై కేంద్రం కొర్రీ.. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత

by Prasanna |
సోయా కొనుగోళ్లపై కేంద్రం కొర్రీ.. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం సోయా కొనుగోళ్లపై పెట్టిన ఆంక్షలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. సోయా పంటకు క్వింటాలు ధర రూ.4892 ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమైంది. అయితే కొనుగోళ్ళు ప్రారంభమైన తర్వాత అసలు విషయం తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అమ్ముకునే సోయా పంటపై కేంద్రం ఆంక్షలు విధించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

6.5 క్వింటాళ్ల ఆంక్షలతో..

కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ రైతు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆంక్షలు విధించడం రైతు నష్టపోవడానికి కారణం అవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయా పంట విపరీతంగా పండుతుంది. వాణిజ్య పంటల్లో సోయా పంటకు విపరీతమైన గిరాకీ కూడా ఉంటుంది. కనీస మద్దతు ధర చూసి రైతులు తమకు ఈసారి భారీ లాభం ఉంటుందని ఆశించారు అయితే ఎకరానికి 6.5 క్వింటాళ్లు మాత్రమే కనీస మద్దతు ధరతో కొంటామని కొనుగోలు కేంద్రాల్లో అధికారులు చెబుతుండడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది సమృద్ధిగా వర్షాలు ఉన్న కారణంగా ఒక్కో రైతు ఎకరానికి కనీసం 10 నుంచి 15 క్వింటాళ్ల మీద సోయా దిగుబడి సాధించారు. కొనుగోలు కేంద్రాల్లో 6.5 క్వింటాళ్ల ను నుంచి కొనుగోలుకు అంగీకరించగా పోతుండడంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి దళారులు..

కేంద్రం విధించిన కొనుగోళ్ల ఆంక్షల నేపథ్యంలో మధ్యధరార్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. కనీస మద్దతు ధర 4892 రూపాయలు ఉండగా ఆంక్షలు కారణంగా రైతు పండించిన పూర్తి పంటను ఆ ధరతో అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దళారులు క్వింటాలకు మూడున్నర వేల నుంచి 4, 200 దాకా ధరతో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో సోయా రైతు ప్రతి క్వింటాలు పై ఆరు నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story