మంచిర్యాలలో టెన్షన్ టెన్షన్

by S Gopi |
మంచిర్యాలలో టెన్షన్ టెన్షన్
X

దిశ, మంచిర్యాల టౌన్: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా పోలీసులను నెట్టుకుంటూ కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య జరిగింది. ఈ తోపులాటలో జిల్లా బీజేవైఎం కార్యకర్త పట్టి వెంకటకృష్ణకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ తో నాయకులు అందుగుల శ్రీనివాస్, రంగ రావు, వెంకటేశ్వర రావులు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు.



Advertisement

Next Story