రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

by Sumithra |
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
X

దిశ, కాగజ్ నగర్ : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కాగజ్ నగర్ మండలంలోని ఇస్గాం దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో రైతువేదికలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ హేమంత్ తో కలిసి పాల్గొన్నారు. ఒడిశాలో రైలు ప్రమాదంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పక్షపాతి, కర్షకుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నోసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రైతుకు బాంధవుడిగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచాడన్నారు.

రైతు సంక్షేమం కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతులందరూ అండగా ఉండాలని కోరారు. అనంతరం జిల్లాకలెక్టర్ హేమంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జూన్ 22 వరకు అధికారులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. అన్నిశాఖల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను సమన్వయంతో జరిగేలా చూడాలని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దశాబ్ది రైతు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్ పర్సన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed