వ్యవసాయశాఖ అధికారి పై సస్పెన్షన్ వేటు

by Sumithra |
వ్యవసాయశాఖ అధికారి పై సస్పెన్షన్ వేటు
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండల వ్యవసాయశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను గత కొన్నిరోజులుగా క్రింది స్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని జిల్లా శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సమగ్రమైన విచారణ జరిపి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి వ్యవసాయశాఖ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story